జనంన్యూస్. 17.సిరికొండ.
పట్టాలు ఇచ్చిన భూములను అప్పగించకుంటే కబ్జాలకు వెళతాం రెవిన్యూ, అటవీ శాఖ అధికారులు జాయింట్ సర్వే చేసి పేదల భూములను అప్పగించాలి.సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్. రమేష్ స్పష్టికరణ రామడుగు పేదల భూముల సమస్య పరిష్కరించకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తాం అని, సర్వే నెంబర్ 1150 లో పట్టాలు ఇచ్చిన 270 మందికి భూములను అప్పగించకుంటే కబ్జాలకు వెళతామని, రెవిన్యూ, అటవీ శాఖ అధికారులు జాయింట్ సర్వే చేసి పేదల భూములను అప్పగించాలని.
సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్. రమేష్ ప్రకటించారు. సోమవారం నాడు ధర్పల్లి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు అఖిల భారత ఐక్య రైతు సంఘం( ఏఐయుకేఎస్ ) సిపిఐ (ఎంఎల్)మాస్ లైన్ ధర్పల్లి సిరికొండ మండలాల సంయుక్త కమిటీ ఆధ్వర్యంలో ప్రాజెక్టు రాముడు గ్రామానికి చెందిన 1150 సర్వే నెంబర్ లో పట్టాల పొందిన లబ్ధిదారులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్. రమేష్ మాట్లాడుతు: ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 20 ఏళ్ల కింద పేదలను గుర్తించి కబ్జామ్ ఉన్న పేదలందరికీ, 270 మందికి పట్టాలు చేసి డిజిటల్ పాస్ బుక్ సైతం ఇచ్చిందని అయినా ప్రభుత్వం సమస్య పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ప్రభుత్వం సిఎల్ డిపి పథకం కింద లక్షల డబ్బులు హెచ్చించి భూమి చదును అభివృద్ధి పనులను చేసి ఒడ్లు సైతం పోశారన్నారు. పంటలు పండించుకుందాము అనుకున్న సమయంలో అటవి శాఖ అధికారులు నిసిగ్గుగా మా భూమిలేని పేదలను అడ్డుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ అడవి శాఖ జాయింట్ సర్వే చేస్తామని హామీ ఇచ్చి కూడా ఏళ్లు గడుస్తున్నాయి అన్నారు. లబ్ధిదారుల పట్ల నిర్లక్ష్య వైఖరి వివరించితే భూమి మీదకు పోయి చదును చేసుకోవడం తప్ప మరో మార్గం లేదన్నారు. భవిష్యత్తులో లాండ్ర సమస్య వస్తే అధికారులదే బాధ్యతఅని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు కే రాజేశ్వర్, ఏఐయుకేఎస్ జిల్లా కార్యదర్శి ఆర్.దామోదర్, సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ మండల నాయకులు డీ. రాంచందర్, టీ. జాన్,కె శ్రీనివాస్, ఏ సాయిలు,ఎన్ రవి, కె రాజేష్, , జంగం సిద్దవ్వ, నక్క. ముత్తవ్వ, తదితరులు పాల్గొన్నారు.


