జనం న్యూస్ :నవంబర్ 17
సోమవారం; సిద్దిపేట నియోజిక వర్గ వై.రమేష్; సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఈరోజు పెందోట బాలసాహిత్య పీఠం ఆధ్వర్యంలో సభాధ్యక్షుడిని, ముఖ్య అతిథిని, ప్రముఖ కవులను సభాసమన్వయం- గడ్డం బాలకిషన్ గెజిటెడ్ హెడ్మాస్టర్ (రి) ఆహ్వానించగా సభ ప్రారంభమైంది. సంస్థ అధ్యక్షులు పెందొట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ- పెందొట బాల సాహిత్య పీఠం 2016లో స్థాపించిoనుండి ఇప్పటి వరకు 57 పుస్తకాలు రచించిన నేను, ఈరోజు 58వ కథల పుస్తకము “చిన్నారి స్నేహితులు”, 59వ పుస్తకం బడి పిల్లల నాటికలు “ముందడుగు” పుస్తకాలను ముఖ్య అతిథి డాక్టర్ నలవోలు నరసింహరెడ్డి వారిచే పుస్తకావిష్కరణ జరిగింది.పుస్తక సమీక్షలో భాగంగా మొదటి పుస్తకము మాడుగుల శివరాజo- “చిన్నారి స్నేహితులు” పుస్తక సమీక్షలో బాల రచయితలలో కథలు వ్రాయాలనే ఉత్సాహం ఉరకలేసింది. ఇలాంటి కథల పుస్తకం చదువుతుంటే విద్యార్థులలో పటన నైపుణ్యం మెరుగవుతుందన్నారు. రెండో పుస్తకము వేల్పుల రాజు- “ముందడుగు” బడి పిల్లల నాటకాలు పుస్తకo కవర్ పేజీ పైన విద్యార్థులచే చక్కని నాటిక ప్రదర్శన బాగుంది. పూర్వకాలంలో నాటకాలు ఆదరణ బాగుండేది. వివిధ పాత్రలలో సజీవమైన బడి పిల్లల నాటికలు వేయించిన పెందొటి “ముందడుగు” అని చెప్పవచ్చున్నారు. ప్రతి సంవత్సరము లాగానే బాలకవులకు కవితల పోటీలు నిర్వహించి దాదాపు12 ప్రభుత్వపాఠశాల విద్యార్థులకు బహుమతు లు సర్టిఫికెట్లు ప్రధానం చేయడం జరిగింది. “పెందొట సాహిత్య పురస్కారాలు 2024” గాను 10 మంది ప్రముఖకవులను ఘనంగా సన్మానించడం జరిగింది. బాలకవులను ప్రోత్సహించిన ఉపాధ్యాయులను కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. సంకలనంలో ముద్రణకు ఎంపికైన కథలు రాసిన బాల కవులను కూడా సన్మానించడం జరిగింది.పెందొట గురువు సభాసమన్వ యంగా వ్యవహరిస్తున్న గడ్డం బాలకిషన్ గెజిటెడ్ హెడ్మాస్టర్(రి) సిద్దిపేటను మెమొంటో శాలువాతో ఆవిష్కరించిన పుస్తకాలు ఇస్తూ తన గురువును ఘనంగా సన్మానించినారు. ఈ సందర్భంగా గురువు మాట్లాడుతూ- బాల కవిత వికాసం కృషి వలుడు బాలబందు పెందొట వెంకటేశ్వర్లకు హృదయపూర్వక అభినందనలు, బాల కవులందరికి ఆశీస్సులు తెలిపారు. ఈ సమావేశంలో ప్రముఖకవులు డాక్టర్ వాసర వేని పరశురాములు, ఎన్నివెళ్లి రాజమౌళి, వరికోలు లక్ష్మయ్య, బైతి దుర్గయ్య, శివరాజు మాడుగుల, గరిపెల్లి అశోక్, నడిమెట్ల రామయ్య, డా.సాదత్ అలీ మొదలైనవారు, సాహిత్య అభిమానులు, విద్యార్థుల తల్లి దండ్రులు, వారి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


