Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 17

తర్లుపాడు మండలం తర్లపాడు గ్రామంలో రైతు సేవ కేంద్రం నందు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మహిళ రైతులకు మరియు చిరుధాన్యాల సాగు చేసే రైతులకు శిక్షణ కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి పి జోష్ణ దేవి నిర్వహించడం అయినది. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం దర్శి సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్ డాక్టర్ మానస రైతులకు వివిధ చిరుధాన్యాలపంటల ప్రాసెసింగ్ మరియు విలువ ఆధారిత ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు నేరుగా ముడి ధాన్యాన్ని విక్రయించడం కంటే ప్రాసెసింగ్ చేసి విక్రయిస్తే అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. మహిళ రైతులు స్వయంగా చిరు ప్రాసెసింగ్ యూనిట్లు ద్వారా వారు పండించిన ఉత్పత్తులను దళారులు లేకుండా స్వయంగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. తద్వారా మహిళలు స్వయం సమృద్ధిని సాధించవచ్చని సూచించారు. ప్రాసెసింగ్ చేసిన చేసిన ఉత్పత్తులు మంచి నాణ్యత కలిగి ఎక్కువ కాలం నిల్వ ఉండి, అవసరం డిమాండ్ ఉన్న సుదూర ప్రాంతాలకి ఎగుమతి చేసుకోవడానికి వీలు కలుగుతుందని రైతులకు ఆమె వివరించారు. మహిళల అభ్యుదయానికి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు చేపడుతున్నటువంటి వివిధ పథకాలను వినియోగించుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఆమె తెలిపారు. సహాయ వ్యవసాయ సంచాలకులు డి బాలాజీ నాయక్ మాట్లాడుతూ రైతులు కందులు సెనగలు మినుములు పెసర పంటలను ప్రాసెస్ చేసి వివిధ రూపాల్లో రైతులు మార్కెట్ చేసుకోవచ్చని తద్వారా రైతులు అధిక లాభాలు సాధించవచ్చని ఆయన రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలోవి ఏ ఏ ఏఈఓ దేవేంద్ర గౌడ్ ,సావిత్రి వి ఏ ఏ, గ్రామ రైతులు మరియు మహిళా రైతులు పాల్గొన్నారు