జనం న్యూస్ ; నవంబర్ 17 సోమవారం ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; వై.రమేష్ ;సిద్ధిపేట:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ లెర్నింగ్ సెంటర్‌లో ఆదివారం ప్రథమ సంవత్సరం అండర్‌గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల కోసం ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ విద్యార్థులకు చదువు విధానం, పరీక్షల సన్నద్ధత, స్టడీ సెంటర్ వినియోగం, కౌన్సెలింగ్ తరగతుల ప్రాముఖ్యతపై విశదీకరించారు.కౌన్సిలర్లు, కొత్తగా చేరిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


