(పయనించే సూర్యుడు నవంబర్ 18 రాజేష్)
దౌల్తాబాద్ : రైతులు ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొందాలని ఐకెపి సిసి బాలరాజు పేర్కొన్నారు. మల్లేశం పల్లి ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర అందించడానికి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని , రైతులు వాటిని సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు పాటించి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. రైతులకు కొనుగోలు కేంద్రాలలో మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని, వర్షాలకు ఇబ్బందులు తలెత్తకుండా తార్పాన్లీన్లను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. రైతులు ఐకెపిసి సిబ్బందికి సహకరించి సహృదయకర వాతావరణంలో ధాన్యం కొనుగోలు జరిగే విధంగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఏ అనిత, మహిళా సంఘాల సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు.


