విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్
జనం న్యూస్ 18 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ
పట్నాయక్‌జిల్లాలో రోడ్లపై మానసిక రుగ్మతలతో బాధపడుతూ, ఆదరించేవారు లేకుండా నిరాశ్రయులైన మతిస్థిమితం లేనివ్యక్తులకు తమవంతు సహకారాన్ని, సహాయాన్ని అందించేందుకు ‘మనోబంధు ఫౌండేషను’ ముందుకు వచ్చినట్లుగాజిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ నవంబరు 17న తెలిపారు. మనోబంధు ఫౌండేషను సభ్యులు ప్రత్యేకంగారూపొందించిన వాల్ పోస్టరును జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ మాట్లాడుతూ – మతి స్థిమితం లేకుండా నిరాశ్రయులై రహదారులపై సంచరిస్తున్న వ్యక్తులకు సహాయాన్ని అందించేందుకు ‘మనోబంధు ఫౌండేషను’ అనే స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ స్వచ్ఛంద సంస్థ సభ్యులు జిల్లాలో రెడ్ క్రాస్ సంస్థ భాగస్వామ్యంతో కార్యాచరణ చర్యలు చేపడుతుందన్నారు. కావున, ప్రజలు తమకు కనిపించిన మానసిక రుగ్మతలతో బాధపడి, నిరాశ్రయులై రహదారులపై సంచరిస్తున్న వ్యక్తుల సమాచారాన్ని మనోబంధు ఫౌండేషను ఫోను నంబరు 9246563738 అందించాలని, ఇతర వివరాలకు వెబ్సైట్ www.manobhandhu.org సంప్రదించాలని కోరారు. మనోబంధు ఫౌండేషను మరియు రెడ్ క్రాస్ సభ్యులు మతిస్థిమితం లేని వ్యక్తులను హెూంలకు తరలించడం, అవసరమైన చికిత్స అందిస్తారన్నారు. సంస్థ సభ్యులు చేపట్టే కార్యకలాపాలకు అవసరమైతే పోలీసులు సహాయాన్ని అందిస్తామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సెక్రటరీ కే.సత్యం, మెడికల్ ఆఫీసరు డా.సిహెచ్. పి.వేణుగోపాల్ రెడ్డి, బి.వి.గోవిందరాజులు, సిహెచ్. మన్మధరావు, బాల సురేష్, టి.రామకృష్ణరావు, నారాయణరావు పాల్గొన్నారు.


