జనం న్యూస్ 18
మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళల్లో కూడా మార్పు వస్తుందని, రోజురోజుకు మేకప్, డిజైనింగ్ రంగంలో మహిళలు మక్కువ చూపుతూ ముందుకు సాగుతున్నారని సామాజిక సేవకులు, మగ్దుంపూర్ అశోక్ అన్నారు. శనివారం నాడు పట్టణంలోని దత్తగిరి కాలనిలో నూతనంగా వెలసిన బ్యూటీ పర్లర్ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా మగ్దుంపూర్ అశోక్ హాజరై రిబ్బన్ కత్తారించి శ్వేతా బ్యూటీ హబ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యూటీ హబ్ యాజమాన్యం అశోక్ కన్స్ ట్రక్షన్ ఎండి అశోక్ ను పూలమాల, శాలువకప్పి బొకేతో సత్కరించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ శ్వేతా బ్యూటీ పార్లర్ మహిళలకు బ్యూటీ టిప్స్ విషయంలో మంచి సేవలు అందించి పేరు ప్రత్యేకతలు సాధించుకోవాలని అన్నారు.



