

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 1 రిపోర్టర్ సలికినిడి నాగరాజు
సెర్చ్ సంస్థ వారి అవగాహన కార్యక్రమం
పల్నాడు జిల్లా నరసరావుపేటలో మునిసిపల్ గెస్ట్ హౌస్ నందు బంగారు భవిష్యత్తు కార్యక్రమం ఐటిసి సెర్చ్ సంస్థ మరియు గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ వారి ఆధ్వర్యంలో ఘనవ్యర్ధాలు ద్రవ వ్యర్థాలు నిర్వహణపై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ శాఖ డీలు ఏఈలు మరియు మండల రిసోర్స్ కోఆర్డినేటర్లు చెత్త నుండి సంపదను సృష్టించడం ఎలా దీనిపై ఐటిసి బంగారు భవిష్యత్తు సెర్చ్ సంస్థ వారు అధికారులకు నిర్వహణ విధి విధానాలను అవగాహన కల్పించే విధంగా తెలియజెప్పడం జరిగింది మరుగుదొడ్ల వినియోగం కమ్యూనిటీ మరుగుదొడ్ల ఆవశ్యకత వాన పాములను ద్వారా ఎరువులు అభివృద్ధి చేయడం నీటి వినియోగం మురికినీటి శుద్ధికరణ పలు అంశాలపై చర్చించడం జరిగింది ఐటిసి వారు వీటి నిర్వహణ పై మెటీరియల్ ను అందజేసినార. ఈ కార్యక్రమంలో భాగంగా ఈఈ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ వి విజయ్ కుమార్ డి ఆర్ డబ్ల్యు ఎస్ ఇ ఓ ఆధ్వర్యంలో ఐటీసీ సెర్చ్ సంస్థ డిస్టిక్ కోఆర్డినేటర్ పి శ్రీనివాసరావు రిసోర్స్ పర్సన్ బుల్లయ్య ట్రైనర్స్ ఎంవి ఫ్రాంక్లిన్ ఏసోబు గురుప్రసాద్ సత్య మరియు డి డబ్ల్యూ ఎస్ సి రమేష్ నవీన్ మండల స్థాయి ఆర్డబ్ల్యూఎస్ ఎ ఈ ఇ లు డిఈఇ లు మండల రిసోర్స్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు