జనం న్యూస్ నవంబర్ 18 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ-
విశాఖ కలెక్టరేట్: విశాఖ ఉక్కు పరిశ్రమ నిలదొక్కుకునేందుకు,నష్టాలనుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, సెయిల్ మాజీ సభ్యులు, బిజెపి నేత వీరన్న చౌదరి అన్నారు. అమరావతి నిర్మాణానికి విశాఖ ఉక్కును వినియోగిస్తే పరిశ్రమకు ఆర్థిక సహకారం అందుతుందని, నష్టాల బాట నుంచి బయట పడుతుందని ఆయన అభిప్రాపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయాలని కోరారు. సొంత గనులు ఉంటే అభివృద్ధి చెందుతుందని తాము డిమాండ్ చేసిన మేరకు గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రాజస్థాన్‌లో గనులు కేటాయించడం జరిగిందన్నారు. అప్పట్లో తాము దీనిని వ్యతిరేకించామన్నారు. స్టీల్ ప్లాంట్ లోని కార్మిక సంఘాలన్నీ చేస్తున్న పోరాటాన్ని ఆయన అభినందించారు. అమరావతితో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు, ఇతర నిర్మాణాలన్నిటికీ విశాఖ స్టీల్ నే వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు. దీనిపై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి వర్మ, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దృష్టి సారించాలన్నారు


