Listen to this article

(జనం న్యూస్ 18 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి)

భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామపంచాయతీలోని ప్రధాన రహదారులపై చెత్తను నిర్లక్ష్యంగా డంపింగ్ చేస్తూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. రోడ్ల పక్కనే గుంతలు తవ్వి చెత్తను పారబోసే విధానంతో దుర్వాసన వ్యాపించి పిల్లలు, వృద్ధులు ఆరోగ్య సమస్యలకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది.ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రాకపోకలు ఎక్కువగా ఉన్న సమయాల్లో రహదారిపై పడేసిన చెత్త కారణంగా వాహనదారులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గ్రామ పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి రోడ్లపై చెత్త పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చెత్తను శాస్త్రీయంగా నిర్వహించేందుకు ప్రత్యేక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు సూచిస్తున్నారు.అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సమస్య మరింత తీవ్రరూపం దాలుస్తుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.