జనం న్యూస్ నవంబర్(18) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో మంగళవారం నాడు ఏఎన్ఎం ధనమ్మ మాట్లాడుతూ మత్తుకు అలవాటు పడి భవిష్యత్తును ఇచ్చిన చేసుకుంటున్నారని సమాజంలోని ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలను వాడకుండా ఉండాలని కాలనీ వాసులతో ప్రతిజ్ఞ చేయించి అలాంటి వారిలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని మూడవ వార్డులో మత్తు పదార్థాల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలో చిన్న వయసు నుండి మొదలుకొని పెద్ద వయసు వారు ముఖ్యంగా యువత మత్తుకు అలవాటు పడి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని పలువురు మత్తు పాదాలకు అలవాటు పడి డబ్బుల కోసం నేరాలు హత్యలకు సైతం పాలు పడుతున్నారని మంచి భవిష్యత్తును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా తమ పిల్లలు ఉన్నతమైన స్థాయిలో ఉంటారని కలలుగన్న వారి కలలను కలలుగా చేస్తున్నారని మత్తు పదార్థాల సేవనం వల్ల మైండ్ తో పాటు విచక్షణ శక్తిని కోల్పోతున్నారని సామాజిక మానసిక, శరీరక, అనారోగ్యాలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతూ సమాజం నుండి దూరమవుతున్నారని అన్నారు.


