Listen to this article

స్వచ్ఛందంగా బందు పాటించిన వ్యాపార సముదాయాలు…

జుక్కల్ నవంబర్ 18 జనం న్యూస్

జుక్కల్ మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులు నత్త నడకగా సాకడంతో మంగళవారం నాడు యువకులు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బందు పిలుపునివ్వడంతో వ్యాపార సంస్థలు సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. జుక్కల్ మండల కేంద్రంలో గత కొన్ని ఎళ్లుగా సెంట్రల్ లైటింగ్ పనులు నిర్వహించేందుకు స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు భూమి పూజలు చేసి పనులను ప్రారంభించారు. మొదట్లో పనులు వేగవంతంగా కొనసాగాయి. రాను రాను పనులు వేగవంతం తగ్గి నత్తనడకగా సాగుతూ ఉండడంతో రెండేళ్లు కాలంలో పనులు పూర్తికాక పోవడం జరిగింది. రోడ్లన్నీ తవ్వేసి మట్టి వేస్తుండడంతో దుమ్ము ధూళి అంతా ప్రజల శరీరంలోకి చేరి శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారని, నిత్యవసర వస్తువులు కొనేందుకు ప్రజలు సుముఖత చూపకపోవడం వలన విసుగెత్తిన మండల కేంద్రంలోని ప్రజలు,వ్యాపారస్తులు, హోటల్ యజమానులు, పండ్లు, కూరగాయల మార్కెట్, బట్టల దుకాణాలు ఇతర చిన్న చితకా వ్యాపార సంస్థలన్నీ స్వచ్ఛందంగా ఎవరి ఒత్తిడి రాజకీయ ప్రమేయం లేకుండా బంధ్ నిర్వహించారు.ఈ క్రమంలో మండల కేంద్రంలోని జనజీవనం ఒక్కసారిగా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ప్రస్తుత ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో పనులు నత్తనడకగా సాగుతున్నాయని విమర్శలు, ఆరోపణలు తారాస్థాయికి చేరాయి. పనులలో వేగం పెంచి ప్రజలకు సౌకర్యాలను కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఇకనైనా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు స్పందించి త్వరలో సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేయాలని ప్రజలు, యువకులు, వ్యాపారస్తులు కోరుతున్నారు.