Listen to this article

జుక్కల్ నవంబర్ 19 జనం న్యూస్

భారత మాజీ మహిళా ప్రధాని,భారతరత్న, స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇందిరా గాంధీ గారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు .. ఈ సందర్బంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ భారతదేశపు కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పారని.. ఆమె రాజకీయ, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని శక్తిమంతమైన నాయకురాలిగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని కొనియాడారు.. ఇందిరాగాంధీ గారు దేశానికి అందించిన నిరుపమాన సేవలు నేటితరం నాయకులకు, యువతకు సైతం స్ఫూర్తిదాయకమని తెలిపారు.. బ్యాంకుల జాతీయకరణ, జమీందారీ వ్యవస్థ రద్దు, గరీబీ హఠావో వంటి దేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని అన్నారు..ఇందిరా గాంధీ భారత స్త్రీ శక్తికి ప్రతీక అని, ప్రపంచవ్యాప్తంగా మహిళలకు స్ఫూర్తినిచ్చే నాయకురాలిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని వెల్లడించారు..అవకాశాలు వస్తే అద్భుతాలు చేయగలం అంటూ నిరూపించారని..ప్రతి మహిళకు ఆమె చూపిన ధైర్యం, అంకితభావం నేటికీ స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు సతీష్ పటేల్, సొసైటీ చైర్మన్ శివానంద్ పటేల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయ గౌడ్, జుక్కల్ మాజీ సర్పంచ్ రాములు సెట్, సాయి పటేల్, కాటేపల్లి మల్లప్ప పటేల్, బస్సాపూర్ సురేష్, గంగు నాయక్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు