Listen to this article

విజయనగరం ట్రాఫిక్ సిఐ సిహెచ్.సూరి నాయుడు

జనం న్యూస్‌ 19 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

విజయనగరం పట్టణంలో రహదారులపై పశువులు స్వేచ్ఛగా సంచరించే విధంగా విడిచిపెడితే చట్టపరమైన చర్యలు తప్పవని ట్రాఫిక్ సిఐ సిహెచ్.సూరినాయుడు నవంబరు 18న హెచ్చరించారు.రహదారులపై పశువులు సంచరించడం వలన రహదారి ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజల ప్రాణాలు, వాహనదారుల భద్రత దృష్ట్యా జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రహదారులపై పశువులు తిరగడం వలన ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నందున, పశువుల యజమానులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్ సిఐ సూచించారు.పశువులను నిర్లక్ష్యంగా రహదారులపై వదిలిపెడుతున్న యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుంది. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడేలా చేసే విధంగా పశువులను రోడ్లపై తిరగనిచ్చిన వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ సిఐ సూరినాయుడు హెచ్చరించారు.జిల్లాలో ప్రజల భద్రత, ట్రాఫిక్ సౌకర్యం దృష్ట్యా ప్రతి ఒక్కరు సహకరించాలని ట్రాఫిక్ సిఐ సిహెచ్.సూరి నాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.