Listen to this article

జనం న్యూస్ జనవరి ఒకటి అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు ఫిబ్రవరి 6వ తేదీ నుండి నిర్వహించబడతాయని, నిన్న జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని, అనకాపల్లి పార్లమెంటు మీడియా కోఆర్డినేటర్ కొణతాల వెంకటరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. గత నవంబరు 2024 నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో మొదలుపెట్టి జనవరి 19వ తేదీతో ముగించారని, ఆంధ్రప్రదేశ్ లో 1,00,22,905 మంది సభ్యులుగా చేరారని, తెలంగాణ రాష్ట్రంలో 1,74,367, అండమాన్ 4,245 మంది సభ్యులుగా మొత్తం 1,02,01,517 సభ్యులుగా చేరి తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారిగా రికార్డ్ సాధించిందని, మొత్తం సభ్యతాలలో 45 శాతం మహిళలు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకోవడం శుభ పరిణామని, వీరిలో కొత్త పాత సభ్యత్వాలు పునరుద్ధరించుకున్నారని వెంకటరావు అన్నారు. ఇక సంస్థ గత ఎన్నికల్లో మహానాడు నాటికి పూర్తి చేయాలని, బూత్ కమిటీలు, క్లస్టర్ , యూనిట్, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, కార్పొరేషన్ డివిజన్ కమిటీలు, మునిసిపాలిటీ వార్డు కమిటీలు, అలాగే శాసనసభ కమిటీ, పార్లమెంట్ కమిటీ లు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు దేశం దిశనిర్దేషణ చేశారని వెంకటరావు తెలిపారు. అలాగే ప్రతి 60 కుటుంబాలకు పార్టీ తరఫున సాధికార సారధిని నియమించాలని, కుటుంబ సాధికార సారధులు యూత్, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జిలను ఫిబ్రవరి 6న ప్రారంభిస్తారని వెంకటరావు అన్నారు. 2025 తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలో మే 27 28 29 తేదీల్లో జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రకటించారని వెంకట్రావు అన్నారు.//