Listen to this article

జనం న్యూస్‌ 19 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

ఉత్తరాంధ్ర లో మూత పడ్డ సహకార చక్కెర ఫ్యాక్టరీలను, రైతులను, కార్మికులను వారి

కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాడ్జి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు మంగళవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ముఖ్యమంత్రి కి రాసిన లేఖను విడుదల చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన సహకార చక్కెర ఫ్యాక్టరీలు ఒక్క ఉత్తరాంధ్ర లోనే ఉన్నాయని విశాఖపట్నం జిల్లా తాండవ (పాయకరావుపేట) ఫ్యాక్టరీ 1969,70 లో(11,215 మంది రైతు సభ్యత్వం తో) ఏటికొప్పాక(దార్లపూడి) ని 1933,34 లో (5,630 మంది రైతు సభ్యత్వం తో) అనకాపల్లి (తుమ్మపాల) 1934,35 లో(13,500 మంది రైతు సభ్యత్వం తో) చోడవరం (గోవాడ) 1962, 63 లో(23,477 మంది రైతు సభ్యత్వం తో) విజయనగరం జిల్లా భీమసింగి (కుమరాం) 1976,77, ( 16,862 మంది రైతు సభ్యత్వం తో)ఏర్పాటు చేశారని,మూతపడ్డ ఐదు చక్కెర ఫ్యాక్టరీ ల పై సుమారు 70 వేల రైతు కుటుంబాలు, వందలాది కార్మికుల, ఉ ద్యోగులు ఆధారపడి జీవించారని ఊహించని రీతిలో ఫ్యాక్టరీ లు మూతపడటంతో రైతులు, కార్మికులు, దిక్కుతోచని స్థితిలో ఉన్నారని కొంతమంది కార్మికులు ఆందోళన తో చనిపోయారని భీశెట్టి ఆవేదన వ్యక్తంచేశారు, ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోకపోతే కర్మాగారం లోని యంత్రాలు తుప్పుపట్టి అమ్మడానికి కూడా పనికిరాని పరిస్థితి నెలకొందని ప్రస్తుతం మూత పడ్డ ఫ్యాక్టరీలను ఇథనాల్ కర్మాగారాలుగా, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలుగా మార్చి ఉపయోగించుకోవచ్చని ముఖ్యమంత్రి కి భీశెట్టి సూచించారు, ఐదు ఫ్యాక్టరీల్లో నాలుగు ఫ్యాక్టరీల రైతులకు ఎటువంటి బకాయిలు లేవని కేవలం సుమారు 40 కోట్ల రూపాయలు కార్మికులకు, ఉద్యోగులకు మాత్రమే బకాయిలు ఉన్నాయని తెలిపారు