జనం న్యూస్ నవంబర్ 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి జిల్లా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్ ) 33 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురికి రొట్టెలు పళ్ళు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. జాప్ ఫౌండర్ ఉప్పల్ లక్ష్మణ్ ,రాష్ట్ర అధ్యక్షులు రవితేజ, ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్డెంట్ కృష్ణారావు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ తాడి రామకృష్ణ మరియు అధ్యక్షులు డాడీ వెంకట్రావు, కార్యదర్శి ఎన్.అజయ్ ప్రసాద్, కార్యవర్గ సభ్యులు వివిధ వర్గాల వారు పాల్గొన్నారు.//


