

జనం న్యూస్ 01 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గం కురిమెళ్ళ శంకర్ )
తెలంగాణ ప్రభుత్వం
మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
శ్రీమతి జె.ఎం. స్వర్ణలత లెనినా, జిల్లా సంక్షేమ అధికారి,మహిళా, శిశు, దివ్యాంగుల మరియు
వయో వృద్ధుల సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
జిల్లా పౌర సంబంధాల అధికారి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
నుండి దివ్యాంగులకు సబ్సిడీ లోన్స్ దరఖాస్తు tgobmms.cgg.gov.in ఆన్ లైన్ ద్వారా స్వీకరించుట కొరకు
దివ్యాంగులకు 2024-25 ఆర్థిక సంవత్సరమునకు గాను ఆర్ధిక పునరావాస పథకం (ఎకనామిక్ రిహాబిలిటేషన్ స్కీం) ద్వారా స్వయం ఉపాధి, పునరావాసం, చేతి వృత్తులు మరియు కుటీర పరిశ్రమలు పెట్టుకొనుటకు గాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 23 మండలాలు మరియు 4 మునిసిపాలిటీలకు 100% రాయితీతో 50,000/- వేల చొప్పున, (మండలానికి మరియు మునిసిపాలిటికి ఒక యూనిట్ చొప్పున) మొత్తం 26 యూనిట్లకు గాను పూర్తి సబ్సిడీ ఋణాలు మంజూరు చేయడం జరుగుతుందని, దరఖాస్తు తేదిని ఈ నెల 12/02/2025 వరకు పొడగించడం జరిగింది. కావున అర్హులైన దివ్యాంగులు tgobmms.CRR ROV.in వెబ్ సైట్ నందు దరఖాస్తు చేసుకొనవలసినదిగా శ్రీమతి జే.ఎం. స్వర్ణలత లెనినా, జిల్లా సంక్షేమ అధికారి పత్రిక ప్రకటన ద్వారా తెలియచేస్తున్నారు.