జనం న్యూస్ నవంబర్ 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
” అర్చకస్య హరసాక్షాత్ చర రూపి సనాతనః “( భగవంతుడు రెండో రూపం అర్చక స్వామి )
పుణ్యభూమి వేద భూమి కర్మభూమి నా భారత దేశంలో ఎన్నో సుప్రసిద్ధ ఆలయాలు ఆ కోవలో దక్షిణ భారతదేశంలోనే ఏకైక ఆలయంగా అలలారుతున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం ఆలమూరులో వేంచేసియున్న శ్రీ పార్వతీ భట్టి విక్రమార్కేశ్వర ఆలయ సన్నిధానంలో కార్తీక మాసం నెల రోజులు ఆలమూరు గ్రామానికి చెందిన మహిళా భక్తులందరూ శివ సన్నిధిలో నమఃశివాయ గేయామృతం మరియు లలితా విష్ణు సంబంధమైనటువంటి దేవీ దేవతా స్తోత్ర పారాయణలు జరుపుకుంటారు ఈ సందర్భంలో ఏదో ఒక రోజున ఆలయ అర్చక దంపతులకు యధాశక్తిగా శివ పార్వతి స్వరూపముగా నూతన వస్త్రాలు సమర్పించి వీరి ద్వారా శివపార్వతుల ఆశీర్వచనం పొందుతారు ఈ సందర్భంలో బుధవారం ఈ రోజున ఆలమూరు మహిళా భక్తులందరూ ఆలయ అర్చకులైన టీటీడీ వార్షిక సత్కార పండితులు బ్రహ్మశ్రీ కాళ్లకూరి సూరి పండు వారు దంపతులకు మహిళా భక్తులు నూతన వస్త్రాలు సమర్పించి శివపార్వతుల ఆశీర్వచనం అందుకున్న సందర్భం…



