జనం న్యూస్ 19 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు జోగులంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గoలో నేడు అయిజ మండల కేంద్రంలో పులికల్ & కిసాన్ నగర్ గ్రామాలలో వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన *ఆలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు,అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు, అలాగే రైతులు కష్టపడి పండించిన పంటలను మధ్య దళారులకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మార్కెట్లలో పండించిన పంట ధాన్యాలను విక్రయించాలని రైతులకు ఆయన సూచించారు,,ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పార్టీ శ్రేణులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


