Listen to this article

జనం న్యూస్ నవంబర్ 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

శ్రీ శ్రీ శ్రీ సర్వకామకాంబ సమేత భోగలింగేశ్వర స్వామి దేవస్థానంలో మాస శివరాత్రి సందర్భంగా గణపతి పూజ, పుణ్యాహ వచనం,గోపూజ పంచాంగయ ప్రాసన మహాన్యాస రుద్రాభిషేకం లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చన శాంతి కళ్యాణం రుద్ర హోమం సహస్ర జ్యోతిర్లింగార్చన స్వామివారి కళ్యాణం భక్తుల సమక్షంలో కడు రమ్యంగా అర్చక స్వాములు నిర్వహించారని దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వేద పండితులు చంద్రమౌళి ప్రభాకర చంద్రమౌళి ప్రభాకర సత్యనారాయణ శర్మ ఎలమంచిలి శ్రీనివాస శర్మ కొత్తలంక పల్లo దాసు శర్మ దేవస్థానం అర్చకులు పేరూరు చిన్నస్వామి పేరూరి సాత్విక్ శర్మ పేరూరు సూర్యనారాయణ ధర్మకర్తలు యలమంచిలి బంగారు రాజు మల్ల సూరిబాబు మద్దాల నారాయణరావు పెంటకోట గణేష్ కొట్ర హరి దూలం సత్యవతి తదితరులు పాల్గొన్నారు.