Listen to this article

జనం న్యూస్ నవంబర్ 19 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన

ప్రతి ఒక్కరు స్వదేశీ వస్తువులనే వాడాలని, విదేశీ వస్తువులపై మోజు తగ్గించుకోవాలని బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి సూర్యనారాయణ గుప్త ( నానాజీ) పేర్కొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని తెలియపరచవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.మంగళవారం మండల నడవపల్లి గ్రామపంచాయతీ పరిధి లోని తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ఇంటింటికి ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు మట్ట సూరిబాబు,దొమ్మేటి పల్లవి వెంకటరావు,పాకాలపాటి త్రినాధ్ వర్మ,దొమ్మేటి గోపాలరావు,కట్ట రాజారావు, మోటిపల్లి నాని,ఉప్పలపాటి సూర్య, తదితరులు పాల్గొన్నారు.