Listen to this article

పొన్నం యువసేన వ్యవస్థాపకులు తంగళ్ళపల్లి రమేష్…

జనం న్యూస్ 1 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)

ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఇటీవలే మరణించినటువంటి మహమ్మద్ పాషా వారి కుమారుడైన మహమ్మద్ ఖాసిం మరియు వడ్లకొండ ఐలయ్య వారి కుమారుడు రమేష్ ను పరామర్శించి వారి చిత్రపటాలకు పూలమాల వేసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన పొన్నం యువసేన వ్యవస్థాపకులు తంగళ్ళపల్లి రమేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులమతం అనే భేదలు లేకుండా మండలంలోని ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి సహాయం చేయడమే లక్ష్యంగా పొన్నం యువసేన ముందుంటుందని అన్నారు అనంతరం ఇటీవలే బదిలీపై ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన ఏ ప్రవీణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి మండల గ్రామ శాఖ అధ్యక్షులు శీలం అనిల్ కుమార్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెల్లి నవీన్ కుమార్ భువనగిరి స్వామి చల్లూరి వేణు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు చెలు ముల వినోద్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు