Listen to this article

దేశాయ్ బ్రదర్స్ యాజమాన్యం దోపిడీ కి వ్యతిరేకంగా పోస్ట్ కార్డుల ఉద్యమం…!

జనంన్యూస్. 19.సిరికొండ.

దేశాయ్ బ్రదర్స్ యాజమాన్యం కార్మికులను చేస్తున్న ఆర్థిక దోపిడీ కి వ్యతిరేకంగా పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని చేపట్టినట్లు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాదు రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రమేష్ వేల్లడించారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో బుధవారం నాడు కార్మికులను నిలువు దోపిడీ చేస్తున్నా దేశాయి బ్రదర్స్ దోపిడీనీ అరికట్టాలనీ దేశాయి బ్రదర్స్ బీడీకార్మికుల తో పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ : కార్మిక శ్రమ దోపిడీ చేస్తూ ఒక కార్మికురాలు వద్ద ఒక అజారుకు పది రూపాయల చొప్పున సుమారుగా 70 వేల మంది కార్మికుల పొట్ట కొడుతూ కోట్ల డబ్బులను నీ దేశాయి కంపెనీ యాజమాన్యం దండుకుంటున్నారన్నారు. చట్ట వ్యతిరేకంగా కనీస వేతనాల చట్టాన్ని ఉల్లంఘిస్తూ, కనీస వేతనాల ఒప్పందని కాలరాస్తూ బీడీ కార్మికులను దోచుకోవడం సిగ్గుచేటు అన్నారు. లేబర్ అధికారుల ముందు వేతనాల ఒప్పందం అమలు పై సంతకం చేసి దొడ్డిదారిన టేకేదారులను మధ్యవర్తులుగా పెట్టుకొని పది రూపాయలు చొప్పున మొక్కు పిండి వసూలు చేస్తున్నారన్నారు. టేకదారు కార్మికుల పక్షాన నిలబడాల్సింది పోయి యజమానియానికె వత్తాసు పలకడం పనికిమాలిన తనమన్నారు. ఇది తగదన్నట్లు పితారా పేరుతో నాసిరకం తినుబండారాలను ఎలాంటి లైసెన్సులు లేకుండా దొడ్డిదారి నా కార్మికులకు అంటగడతు అటు ప్రభుత్వాన్ని ఇటు కార్మికులను మోసం చేస్తున్నారన్నారు. అనుమతి లేకుండా కార్మికులకు బలవంతన్న అంటగడుతున్నారన్నారు. వేయి భీడీలకు సరిపోయే నాణ్యమైన ఆకు, దారము, తంబాకు ఇవ్వకుండా కార్మికులను నిండా ఉంచుతున్నారన్నారు. దేశాయి బ్రదర్స్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పలు దపాలుగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ దేశాయి బ్రదర్స్ యాజమాన్యం నిమ్మకు నీరు ఎత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికైనా తమ డిమాండ్స్ ను నెరవేర్చకుంటే మా పోరాటాలను తీవ్రం చేసి చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్. దామోదర్, ఏఐయుకేఎస్ మండల నాయకులు బి సర్పంచ్, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ మండల నాయకురాలు ఇ. స్వరూప, బీడీ కార్మికులు జి సులోచన, అడ్వాళ పెద్దు, ప్యాట్ల గంగామణి,ఎం.శ్రీలత, జి మంగమ్మ, ఎం పద్మ, ఏ గంగామణి, ఏ లావణ్య, పి లక్ష్మి, ఎ ప్రమీల, కె లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.