జనంన్యూస్, తేదీ 20-11-2023. భద్రాది కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం.
రిపోర్టర్ బాలాజీ.
బిఆర్ఎస్ పార్టీ పాల్వంచ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిన అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈరోజు వరకు రోడ్లపై తట్టెడు మట్టి పోయట్లేదు, కొత్త రోడ్ల నిర్మాణం చేయడం లేదు. గ్రామ పంచాయతీలకు రెండు సంవత్సరాల నుండి ఎన్నికలు నిర్వహించకపోవడం వలన పాలకవర్గాలు లేక గ్రామాలలో అభివృద్ధి కుంటుపడి రోడ్లు మొత్తం గుంటలమయంగా మారి రోడ్డుకు ఇరుపక్కల పిచ్చి చెట్లు మొలిసి రహదారులని అస్తవ్యస్తంగా మారాయి. డ్రైనేజీలలో చెత్త, చెదారం, మురుగునీరు పేరుకుపోయి దుర్గంధంగా తయారయ్యాయని ఈ యొక్క సమస్యలపై భద్రాద్రి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపుమేరకు ఈరోజు పాల్వంచ మండలంలోని పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని పాల్వంచ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంతపురి రాజు గౌడ్, కాంపెల్లి కనకేష్ పటేల్, కాలేరు సింధు తపస్వి ల ఆధ్వర్యంలో పాల్వంచ ఎంపీడీవో ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా మంతపురి రాజు గౌడ్, కాంపెల్లి కనకేష్ పటేల్, కాలేరు సింధు తపస్వి లు మాట్లాడుతూ పాల్వంచ మండలంలోని 36 గ్రామపంచాయతీలలో రోడ్లు మొత్తం గుంటల మాయంగా మారాయని, డ్రైనేజీలు అన్ని మురుగునీరు, చెత్తా, చెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయని, తక్షణమే వాటన్నింటిని మరమ్మతులు చేయాలని మరియు పాల్వంచ మండలంలో కొత్త రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని తక్షణమే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలను ఏర్పాటు చేయాలని లేని పక్షంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళనలు నిర్వహిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు సంగ్లోత్ రంజిత్, మారుమూళ్ల కిరణ్, పూజల ప్రసాద్, కొట్టే రాఘవేంద్ర (రవి), తోట లోహిత్ సాయి, కాలేరు అఖిల్ మహర్షి, తోట ప్రవీణ్, పోసారపు అరుణ్ కుమార్, మహమ్మద్ ఆదిల్, కుమ్మరి కుంట్ల వినోద్, గిద్దలూరి శివ సాయి, కూరెల్లి మురళీమోహన్,దాసరి సురేష్
నడిగట్ల రంజిత్, ఎస్ కె. రియాజ్, వరపర్ల జీవన్,అనిల్, ఫరీద్, షారుక్, మున్నా, హసీబ్, షరీఫ్, సాయి తదితరులు పాల్గొన్నారు.


