

జనం న్యూస్. జనవరి 10. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.తిర్యాణి మండలంలోని గోపెర బొజ్జుగూడ గ్రామంలో పోలీసు మీకోసం కార్యక్రమంలో భాగంగా గురువారం 150 మందికి దుప్పట్ల, యువతకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐపీఎస్ ఏఎస్పి చిత్త రంజిత్,పాల్గొని వారి చేతుల మీదుగా పంపిణీ చేశారుఈ కార్యక్రమంలో రెబ్బన సీఐ బుద్దె స్వామి, తిర్యాణి ఎస్సై ఎంబడి శ్రీకాంత్, కాంగ్రెస్ జిల్లా నాయకులు జువ్వాజీ అనిల్ గౌడ్, తిర్యాణి మండల అధ్యక్షులు చిత్తరి సాగర్, పెరుమండ్ల వెంకటేశం గౌడ్, ఎస్సీ సెల్ తిర్యాణి మండల అధ్యక్షులు పడగల అమర్, మాజీ సర్పంచ్ గోపాల్, సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ బొక్కనపల్లి సాయికిరణ్, సైదాం లచ్చన్న పెందోర్ ధర్మారావు, మాజీ సర్పంచ్ భీంరావు, కోవా సోనేరావు గ్రామస్తులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.