జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లెలో శ్రీ అయ్యప్ప స్వామి వారి గ్రామోత్సవం అత్యంత ఘనంగా నిర్వ హించారు బుధవారం ఉదయం శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణ కమిటీ గణపతి హోమం అయ్యప్ప మూలమంత్ర భవనం అనంతరం అయ్యప్పస్వామి కి అష్టాభిషేకం నిర్వహించారు. సాయంత్రం అత్యంత ఘనంగా శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సహిత శ్రీ అయ్యప్ప స్వామి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ గ్రామోత్సవం లో పెద్ద ఎత్తున మహిళలు,అయ్యప్ప దీక్షా పరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాలు గురు స్వామి,తోట శివశంకర్ గురుస్వామి,సుధాకర్ గురుస్వామి,మురళి గురుస్వామి,కుమార్ గురుస్వామి,యల్లయ్య గురుస్వామి,రమేష్ గురుస్వామి,జనార్దన్ రెడ్డి, జయకుమార్ రెడ్డి,అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.


