

*పి వై ఎల్ రాష్ట్ర అధ్యక్షులు మోకాళ్ళ రమేష్
జనం న్యూస్ 01 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్)
జిల్లాలో డ్రగ్స్, గంజాయి లాంటి మాలకద్రవ్యాలు విచ్చలవిడిగా హై స్కూల్, కాలేజీలను టార్గెట్ చేసుకొని సరఫరా చేస్తున్నారని, సరఫరా చేసే వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్ )రాష్ట్ర అధ్యక్షులు మోకాళ్ళ రమేష్ డిమాండ్ చేశారు.
శనివారం ఇల్లందు పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రగతిశీల యువజన సంఘం ( పి వై ఎల్) జిల్లా కమిటీ సమావేశం లో తను మాట్లాడుతూ గతంలో పట్టణ ప్రాంతాలకు పరిమితమైన డ్రగ్స్, గంజాయి ఇప్పుడు పల్లెల్లోకి ప్రవేశించాయని విద్యార్థులు ,యువత ఈ చెడు వ్యసనాలకు బానిసై వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారని అన్నారు.
ఎన్నికల ముందు డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు లేని రాష్ట్రముగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కంటి చర్యలు మాత్రమే తీసుకున్నారని ఆరోపించారు.
గ్రామాలలో పుట్టగొడుగుల పుట్టకొస్తున్న బెల్టు షాపులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారు ఈ సంవత్సర కాలంలో కనీసం 20000 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయారని అన్నారు.
నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పి హమి అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్ )జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి చింత నరసింహారావు, పర్శక రవి, జిల్లా నాయకులు వాంకుడోత్ మోతిలాల్, నోముల భానుచందర్, జోగా కృష్ణ, రావూరి ఉపేందర్, కొడెం రవి, ఎనగంటి లాజర్, సాధనపల్లి రవి, బర్ల రామకృష్ణ, పూనేం సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.