Listen to this article

ఎల్కతుర్తి మండల సోషల్ మీడియా అధ్యక్షులు గుండేటి సతీష్ నేత…

జనం న్యూస్ 1 ఫిబ్రవరి 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఇందిరమ్మ రాజ్యం అంటే ఎన్నికల్లో 420 హామీలు ఇవ్వడమేనా?ఇచ్చిన హామీలల్లో భాగంగా కొన్ని పథకాలు మాత్రమే అరకొర అమలు చేయడమా?మండలానికి ఒక గ్రామాన్ని ఎంచుకొవడమేనా ఇందిరమ్మ రాజ్యం ? ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి గద్దె నెక్కి అరకోర పథకాలు కొంతమందికి అమలు చేయడమా? ఇందిరమ్మ రాజ్యం!మండల కేంద్రంలోని మిగతా గ్రామాల ప్రజలు ఇందిరమ్మ రాజ్యంలో లేరా ? ఓట్లేసి గెలిపించిన ప్రజలు ప్రభుత్వ పథకాలకు అనర్హుల? ఎప్పుడు ఇస్తారు రైతులకు భరోసా ? ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అంటూ ఆశల పల్లకిలో ఉయ్యాలలు ఊపుతున్న కాంగ్రెస్ పార్టీ! సెల్ ఫోన్లు చేతిలో పట్టుకొని ఎప్పుడు టింగ్ టింగ్ అంటుందా డబ్బులు ఇగ వస్తాయా ఆగ వస్తాయా అంటూ ఎదురు చూస్తున్న అమాయక రైతన్నలకు సమాధానం చెప్పాలి!నీటి మూటలు కట్టే నాయకులు అధికారంలోకి వచ్చి 13 నెలలు దాటిన రైతులకు భరోసా అందకపోవడం ఓట్లు వేసినా రైతన్నల తప్పే అంటారా? పైలెట్ ప్రాజెక్టు పేరు చెప్పి మండలానికి ఒక గ్రామానికి ఇచ్చి మిగతా గ్రామాల రైతన్నలకు పంగనామం పెట్టడమేనా ? ప్రజా పాలన
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా వచ్చింది ఇందిరమ్మ రాజ్యం
ఓట్లేసి గెలిపించినందుకు
అనుభవించు రాజా అని కాంగ్రెస్ అన్నట్లు ఉంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన రైతన్నలకు అర్థమవుతుందని బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఆశిస్తున్నాం రైతన్నలకు సకల సౌకర్యాలు అందించిన కెసిఆర్ ను కాదని నయవంచన పార్టీలకు ఓటు వేస్తే ఇలాగే జరుగుతుంది జై రైతన్న జై కేసీఆర్ జై బిఆర్ఎస్