Listen to this article

జనం న్యూస్ 20 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్

జిల్లా జోగులాంబ గద్వాల్ జిల్లా యన్ యచ్ పి యస్ జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్.*గద్వాల:* నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో నేడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి చిత్రపటానికి నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.సామాజిక రాజకీయ చారిత్రక అంశాలపై బండ సురేందర్ రెడ్డి అవగాహన కలిగిన వ్యక్తి అని, ఎదుటివారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే మంచి నాయకుడని, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అనుభవం నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన ప్రజా నాయకుడని ఆయన సేవలను కొనియాడారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, నాయకులు కార్తీక్, అడివి ఆంజనేయులు,సుదర్శన్, విజయ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.