.జనం న్యూస్ నవంబర్ 20 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్
రెడ్డి కూకట్‌పల్లి: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ కార్యదర్శిగా, ఒడిశా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన సీనియర్ నాయకుడు జెట్టి కుసుమ్ కుమార్‌ను కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయకులు ఆయన స్వగృహానికి వెళ్లి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం పుష్పగుచ్ఛం అందించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.పార్టీ పటిష్టత కోసం నిరంతరం కృషి చేస్తున్న జెట్టి కుసుమ్ కుమార్‌కు జాతీయ స్థాయి బాధ్యతలు దక్కడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఒడిశా రాష్ట్ర ఇన్‌చార్జిగా ఆయన తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, పార్టీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గొట్టిముక్కల జశ్వంత్ రావు జీజేఆర్ గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి సంజీవరావు, మాజీ ఉపాధ్యక్షురాలు రేష్మ, నాయకులు రాజేష్ గౌడ్, మాకడూమ్, రామారావు, జాన్, బాబురావు, శ్రీధర్ చారి, గిరి నాయుడు తదితరులు పాల్గొన్నారు.



