

జనం న్యూస్ ఫిబ్రవరి 1 జగిత్యాల జిల్లా బీర్పుర్ మండలంలోని వివిధ గ్రామాల వ్యవసాయ ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీ చేసిన మండల వ్యవసాయ అధికారి ఎం రాజ్ కుమార్ ఇందులో భాగంగా యూరియా స్టాక్ వివరాలు మరియు గొడౌన్స్ ని తనిఖీ చేసిన తారు వాత వ్యవసాయ అధికారి మాట్లాడుతూ. డీలర్లు ఎరువులను ఎం ఆర్ పి ధరలకే అమ్మలని మరియు స్టాక్ వివరాలు తెలిసేలా షాప్ లో బోర్డు ఏర్పాటు చేయాలని, రైతులకు తప్పకుండా రశీదు ఇవ్వాలని అదే విధంగా స్టాక్ రిజిస్టర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించడం జరిగింది..ఎవరైనా డీలర్లు ఎం ఆర్ పి కంటే ఎక్కువ ధరలకు ఎరువుల విక్రయించినట్టు తెలిస్తే లైసెన్సు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వ్యవసాయ అధికారి తెలియచేసారు ఈ కార్యక్రమంలో ఫిర్టిలైజర్స్ షాప్ యాజమాన్యాలు తదితరులు పాల్గొన్నారు