

గొడుగు శ్రీధర్ భారతీయ జనతా పార్టీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు
జనం న్యూస్ 01 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్)
భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ని శ్రీమతి సోనియా గాంధీ అన్న మాటలు దురదృష్టకరమని భారతీయ జనతా పార్టీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు తీవ్రంగా విమర్శించారు ఒక గిరిజన మహిళ భారత అత్యున్నత పదవిని అధిష్టిస్తే పరాయి దేశం నుండి వచ్చిన మీకు శ్రీమతి సోనియా గాంధీ కి సముచితమైన విలువను అందించింది ఈ భారతదేశం అని అన్నారు వెంటనే ముర్ము కి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరపున డిమాండ్ చేశారు లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుని విషయంపై ఆలోచిస్తామని అన్నారు.