Listen to this article

జనంన్యూస్. 20.సిరికొండ.

నిజామాబాదు రురల్ సిరికొండ మండలం పాకాల పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి సీతక్కకు రైతు, కూలి సంఘాల నేతలు వినతి పత్రం అందించి విజ్ఞప్తి.చేశారు.ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన అటవీ అధికారులు అడ్డుకుంటున్న పేదల భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని,( ఏఐపీకేఎంఎస్) జిల్లా కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి సీతక్క కు వినతి పత్రం అందజేసీ విజ్ఞప్తి చేశారు సిరికొండ మండలంలోని సిరికొండ, గడ్కోల్, హుస్సేన్ నగర్, తూంపల్లి గ్రామాల్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన పట్టా భూముల్లో కెసిఆర్ ప్రభుత్వం వచ్చినాక సాగును అడ్డుకుంటున్న ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ను అరికట్టుట , సిరికొండలో sy 532,గడ్కోల్ sy 100 తుంపల్లి గ్రామాల్లో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని మరియు హుస్సేన్ నగర్ గ్రామ పరిదిలోని ప్రభుత్వ భూమి (ల్యాండ్ లార్డ్ జాగీర్దార్ సైదర్ జంగ్ ద్వారా సీలింగ్ ప్రభుత్వ భూమిగా )సర్వే నెం: 836లో SC, BC, మైనారిటీలకు చెందిన 70 మంది వ్యవసాయ కూలీలు 2001సంవత్సర0 నుండి సుమారుగా 140ఎకరాలు సాగుచేసుకుంటున్న భూమినకి పట్టాలు ఇచ్చుట గురించి.
2004 సంవత్సరంలో భూపంపిణి కార్యక్రమంలో భాగంగా గడ్కోల్, సిరికొండ పేదలకు పట్టాలు ఇవ్వడం జరిగిందని, ఇట్టి భూములు ఆనాటి నుండి సాగు చేస్తున్న పేదల భూముల్లో కెసిఆర్ ప్రభుత్వం 2018 లో అక్రమ0గా కంధకాలు తవ్వడం, సాగును అడ్డుకోవడం జరుగుతుందన్నారు. ఇట్టి భూములకు కాంగ్రెస్ ప్రభుత్వం లో CLDP స్కీమ్ ద్వారా డెవలప్మెంట్ చేసిన భూములను అటవీ అధికారులు అడ్డుకోవడం సిగ్గుచేటు అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం లో వచ్చిన వెంటనే సాగు, పోడు భూముల సమస్య పరిష్కారం చేస్తమని హమీ ఇచ్చారు రెండు సంవత్సరాలు అవుతుంది కానీ పరిష్కారం దొరకడం లేదన్నారు. గడ్కోల్ సిరికొండ గ్రామల్లో రెవిన్యూ పట్టా భూములలో ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఆపాలని, సాగు అడ్డంకులు ఉండకుండా ఆదేశాలు ఇవ్వాలని వారు కోరారు. అట్లాగే హుస్సేన్ నగర్ గ్రామానికి చెందిన నిరుపేద SC, BC, మైనారిటీ పరిధిలో గల ప్రభుత్వ భూమి సర్వే నెం: 836లో 285 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమి కలదు. ఇందులో నుండి సుమారుగా 140ఎకరాలను మేము గత 24సంవత్సరాలనుండి అడవి ఆముదం సొయా,పజ్జోన్న తదితర అరుతడి పంటలను సాగు చేసుకుంటున్నాం. అందులో SC మాదిగలు 32 మంది మాల కులానికి చెందిన 03 (ముగ్గురు), BC కులాలకు చెందిన గొల్ల, ముదిరాజ్ లు, మైనారిటీ లు 35 మంది మొత్తం 70 కుటుంబాలు సాగు చెసుకుంటున్నాయి.జీవనోపాధి పొందుతున్నారు.
ఇట్టి భూమి గతంలో మా గ్రామ జగిర్దార్ సైదార్ జంగ్ S/O యూసుఫ్ అలీ అనే జగిర్ధార్ కుటుంబం నుండి సుమారు వెయ్యి ఎకరాలు సీలింగ్ ద్వారా ప్రభుత్వం తీసుకొని పేదలకు ఇచ్చిందిమిగతాsy836 సాగుచేస్తున్నపేదలకుపట్టాలురాలేదు.కానీ2018 ధరణివచ్చిననుండి సైదర్జంగ్కు చెందిన వారసుల మని పైరవిలు చేస్తూ మా భూములు “కా “చేసే ప్రయత్నం చేస్తున్నారు.కొంత మంది డబ్బులు పోగు చెసుకొని నకిలీ వ్యక్తిని పెట్టి ఈ భూమిని కొట్టేయ్యాలని కొంతమంది లక్షల డబ్బులను హైదరాబాద్ లో పైరవీలు నడు పుతున్నారు.గతంలో కూడా ఇదే సిరికొండ మండలం లోని మా పొలిమేర లో గల రామడుగు గ్రామంలో ఇలాగే ఇదే జాగీర్ధార్ వారసులమని ఆ గ్రామానికి చెందిన భూములను కబ్జా చేసి పట్టాలు పొందాలని ప్రయత్నాలు చేయగా సీపీఐ(ఎం. ఎల్) ప్రజాపంథా పార్టీ ఉద్యమం, గ్రామస్తుల పోరాటం తో, ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడంతో బినామీ వ్యక్తుల పై గల రిజిస్ట్రేషన్ ను రద్దు చెసి అదే గ్రామనికి చెందేలాగా చేసి అక్కడి వారికి న్యాయం చేశారన్నారు.దశబ్దాల కాలంగా పహాణి నకల్ లో ప్రభుత్వ భూమిగా రికార్డ్ చేశారు. ప్రభుత్వ భూమి పేదలకు దక్కే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఇప్పటి కైన ప్రభుత్వం మానవతా దృక్పధంతో అలోచించి గత 24 సంవత్సరాలనుండి కబ్జాలో ఉన్న హుస్సేన్ నగర్ గ్రామ SC, BC, మైనార్టీ నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలి అని విజ్ఞప్తి వారు కోరారు.కార్యక్రమంలో AIUKS జిల్లా ప్రధాన కార్యదర్శి B.బాబన్న. జిల్లా కార్యదర్శి రిక్క. దామోదర్, AIPKMS జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ .రమేష్, AIUKS జిల్లా కోశాధికారి ఎం. లింబాద్రి, AIPKMS జిల్లా సహయకార్యదర్శి జి. సాయిరెడ్డి, నాయకులు జె. బాల్ రెడ్డి, Aipkms జిల్లా ఉపాధ్యక్షలు బి .కిషోర్, Aipkms జిల్లా నాయకులు జె .ఎర్రన్న, AIUKS జిల్లా నాయకులు బి సర్పంచ్, మండల నాయకులు v. భూమాగౌడు, ఎం మోహన్, తదితరులు పాల్గొన్నారు.