Listen to this article

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఫిబ్రవరి 1 :

ఏన్కూర్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు నేటి నుండి పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించినట్లు ప్రధాన ఉపాధ్యాయులు  కే సైదయ్య తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు 38 రోజులు ఎస్ఎస్సి విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన అల్పాహారాన్ని ప్రతిరోజు సాయంత్రం వేళల్లో విద్యార్థులకు అందించనున్నారు. ఉదయం నే పాఠశాలకు వచ్చిన విద్యార్థులు సాయంత్రం వరకు ఉండవలసి ఉన్నందున ఈ అల్పాహారాన్ని అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మండల అభివృద్ధి అధికారి రమేష్ విద్యార్థులకు ఉల్లిపాయ పకోడీలను అందించారు. ఈ కార్యక్రమంలో ఏఐపిసి చైర్మన్ జి వెంకటలక్ష్మి, రాఘవరావు, శ్రీధర్, కస్తూరి, విజయలక్ష్మి, పుల్లయ్య, శంకర్రావు ,వర్జినియా రాంబాబు,నరసింహారావు,సులోచన భీమ్ సింగ్, వీరయ్య,కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.