Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 1 ముమ్మిడివరం నియోజకవర్గం ప్రతినిధి ( గ్రంధి నానాజీ)
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై , ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు హర్షం వ్యక్తం చేశారు. ప్రజానుకూల బడ్జెట్‌ ను కేంద్రమంత్రి ప్రవేశపెట్టారన్నారు. ఈ బడ్జెట్‌ లో మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఇన్ కమ్ ట్యాక్స్, నిత్సవసర సరుకులు ధరలు తగ్గించటానికి అన్నిరకాలుగా అందివచ్చే విధంగా బడ్జెట్ ఉందన్నారు. ఈ సంధర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ , ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కి ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) అభినందనలు తెలియజేశారు.