Listen to this article

జనం న్యూస్‌ 21 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

జిల్లా పర్యటనలో భాగంగా విజయనగరానికి వచ్చిన రాష్ట్ర SC కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్కు కలెక్టరేట్ వద్ద జిల్లా అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్లో చైర్మన్ జవహర్, కమిషన్ సెక్రటరీ ఎస్. చినరాయుడుతో కలెక్టర్ రాం సుందర్ రెడ్డి, ఎస్పీ దామోదర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల పనితీరుపై వివరాలను జవహర్ అడిగి తెలిసుకున్నారు.