జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 21
తర్లుపాడు మండలం, కలుజువ్వలపాడు గ్రామంలో జవహర్ నవోదయ విద్యాలయం నందలి 9 తరగతి విద్యార్థులకు స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రాం గురించి శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయాధికారి పి. జ్యోత్స్న నేల ఆరోగ్యం ప్రాముఖ్యత గురించి వివరించారు. ఒంగోలు భూసార పరీక్షా కేంద్రం ఎ. ఒ. డి. స్వరూప మట్టి నమూనా సేకరణ, పరీక్షా విధానం, మొబైల్ అప్లికేషన్, టెస్టింగ్ పరికరాలు మరియు పనిచేసే విధానం గురించి వివరించారు.జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయధికారి శేషమ్మ మట్టి నమూనా సేకరించే డెమో గురించి వివరించి, చేసి చూపించినారు.ఈ కార్యక్రమం లో స్కూల్ ప్రిన్సిపల్, టీచర్స్ మరియు స్టూడెంట్స్ పాల్గొన్నారు.



