జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.21- 11- 25
నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోగల అరవపల్లె గ్రంథాలయంలో శుక్రవారం 58వ గ్రంథాలయ వార్షికోత్సవ ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగిరెడ్డి పల్లె సర్పంచ్ జంబు సూర్యనారాయణ మండల విద్యా శాఖ అధికారి అనంత కృష్ణ ,నాగిరెడ్డి పల్లె జిల్లా పరిషత్,పాఠశాల,ప్రధానోపాధ్యాయుడుగంగనపల్లి వెంకటరమణ జ్ఞాన దీప్తి ప్రధాన ఉపాధ్యాయు రాలు లక్ష్మీ,గ్రంథాలయాధికారి శివ శంకర్ రాజు నాగిరెడ్డిపల్లి ఉపాధ్యాయుడు జి కృపానందం తదితరులు పాల్గొన్నారు,ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానాన్ని పెంపొందించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహి స్తారని ప్రస్తుతం సెల్ ఫోన్లు ద్వారా విద్యార్థులుఆరోగ్యాలు దెబ్బ తీసుకుంటున్నారని పుస్తక పఠనం చేస్తే జ్ఞానంతో పాటు మంచి ఆరోగ్యం మంచి ఆలోచనలు వస్తాయని భవిష్యత్తులో మంచి పౌరుడిగా ఎదిగేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలిపారు అంతేకాక పుస్తకం ఒక మంచి స్నేహితుడని పుస్తకాల ద్వారా తమ భవిష్యత్తులో ప్రణాళికతో ఈ గ్రంథాలయం ఒక నిఘంటువుల ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుందని నోరు మెదపని ఉపన్యాసకుడు పుస్తకం అని అజ్ఞాన దీపం వెళ్లి జ్ఞానము అనేది దీపం పుస్తక పఠనం ద్వారా వస్తుందని వారు తెలిపారు తల్లి తండ్రి జన్మ నిస్తే జ్ఞాన మనేనేత్రాన్ని ఉపాధ్యాయుడు ఇస్తాడని వారు తెలిపారు విద్యార్థులు గ్రంధా లయాన్ని సద్విని యోగం చేసుకొని రోజుకి కొంత సమయాన్ని గ్రంథాల యానికి కేటాయించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగిరెడ్డి పల్లె జిల్లా పరిషత్ హై స్కూలు,జ్ఞాన దీప్తి హైస్కూలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు గ్రంథాలయ అధికారి రవి శంకర్ రాజు, మాచుపల్లి రవి,అనంతరం వారికి బహుమతులు అందజేశారు,



