Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.నవంబర్ 21,

నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోగల నాగిరెడ్డిపల్లిలో ఎర్ర చెరువు కట్టపై,నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణానికి దండు నాగేశ్వరావు ఆయన ధర్మపత్ని దండు వాణి , కుమారుడు దండు వెంకటవశిస్ట్,లు20,000/ రూపాయలు విరాళంగా, అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి దేవాలయ కమిటీ అధ్యక్షులు ఏనుగుల బాలాంజనేయులు కు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్పస్వామి దేవాలయం నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమం లో కమిటీ సభ్యులు మేడా వెంకట కుమార్,పెమ్మన బోయిన యల్లయ్య, తోట శివ శంకర్ ,ముమ్మడిశెట్టి సుధాకర్, రాచురి మురళి, మన్నెరి బెస్త సుబ్రహ్మణ్యం, రాము,అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు.