జనం న్యూస్ 21నవంబర్ ( పినపాక నియోజకవర్గం )
జనవిజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో జన విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలలో భాగంగా చెకుముకి మండల స్థాయి టాలెంట్ టెస్టును జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కో ఎడ్యుకేషన్ మణుగూరు నందు నిర్వహించారు. ఈ మణుగూరు మండల స్థాయి టాలెంట్ టెస్ట్ కు మణుగూరు మండలంలోని హై స్కూల్ విద్యార్థులు పోటీపడ్డారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గవర్నమెంట్ డిగ్రీ కళాశాల మణుగూరు ప్రిన్సిపాల్ డి భద్రయ్య, ప్రభుత్వ జూనియర్ కళాశాల మణుగూరు ప్రిన్సిపాల్ నల్లగట్లసత్య ప్రకాష్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కో ఎడ్యుకేషన్ పానెల్ గ్రేడ్ హేడ్మిస్ట్రీస్ జి నాగశ్రీ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జన విజ్ఞాన వేదిక వారు నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ సంబరాలలో భాగంగా మణుగూరు మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ వలన విద్యార్థులలో శాస్త్రీయ దృక్పదాలు అభివృద్ధి చెందుతాయి అన్నారు. మూఢనమ్మకాలను సమాజం నుండి పారదోలడానికి జన విజ్ఞాన వేదిక ఎంతో కృషి చేస్తోంది అన్నారు. జనం యొక్క విజ్ఞానం కోసం జనవిజ్ఞాన వేదిక నిరంతరం పాటుపడుతుంది అన్నారు. విద్యార్థులు చిన్నతనం నుండే సైన్స్ పట్ల మక్కువ పెంచుకొని భావి శాస్త్రవేత్తలుగా కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక చెకుముకి మండల కన్వీనర్స్, షేక్ మీరా హుస్సేన్ భద్రాద్రి కొత్తగూడెం ఎన్విరాన్మెంటల్ కార్యదర్శి, లింగంపల్లి దయానందు, తెలంగాణ రాష్ట్ర కల్చరల్ కార్యదర్శి లు మాట్లాడుతూ… మండల స్థాయిలో విజేతలైన విద్యార్థుల బృందం ఈనెల 28వ తారీఖున భద్రాద్రి కొత్తగూడెంలో జరిగే జిల్లాస్థాయి పోటీలకు హాజరు కావలసి ఉంటుంది అన్నారు
ముగింపు సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ బాలకృష్ణ , సింగరేణి హై స్కూల్ ఇన్చార్జ్, ఎం వేణు మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో సమాజంలో శాస్త్రీయ దృక్పాదాలను పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు.సింగరేణి హై స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన కళా నృత్యం అందరినీ ఆకట్టుకుంది. మండల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మరియు బహుమతులు అందజేశారు. అదేవిధంగా ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థులు అందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో , ఉపాధ్యాయులు పరమయ్య, సత్యనారాయణ, కల్పన, అనూష, పాషా, వీరు నాయక్, వెంకటేశ్వర్లు ,సుజిత్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా స్థాయికి ఎంపికైన విజేతల వీరే ఇంగ్లీష్ మీడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాలల విభాగంలో మండల మొదటి ప్రైజ్ ను జిల్లా పరిషత్ మండల పాఠశాల కు ఎడ్యుకేషన్ విద్యార్థులుడి.వికాస్, ఎం అశ్విత, జి నాగచైతన్య గెలుచుకున్నారు.ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్స్ విభాగంలో మండల మొదటి బహుమతిని ఎక్సలెంట్ హై స్కూల్ బొంబాయి కాలనీ విద్యార్థులు, వై యశ్విత శ్రీ, ఎస్ సంహిత, జి లోహిత్ తెలుగు మీడియం విభాగంలో జిల్లా పరిషత్ పాఠశాల కో ఎడ్యుకేషన్ మణుగూరు విద్యార్థులు బంగారమ్మ, అశోక్ రామ్, చరణ్ ,గెలుచుకున్నారు.



