జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 22
జిల్లా అధికారుల ఆదేశాల మేరకు తర్లుపాడు మండల ఎంపీడీఓ కార్యాలయ కార్య నిర్వహణ అధికారి బుర్రి చంద్రశేఖర్, ఉప ఎంపీడీఓ జి రాఘవరావు ఆధ్వర్యంలో తర్లుపాడు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పంచాయతీ కార్యదర్శులు మరియు హరిత రాయబారులు సంయుక్తంగా మీర్జాపేట గ్రామపంచాయతీలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా, పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులు గ్రామం నలుమూలలా తిరిగి, కనిపించే చెత్తను పూర్తిగా తొలగించి, మీర్జాపేట గ్రామపంచాయతీని పరిశుభ్రమైన గ్రామపంచాయతీగా తీర్చిదిద్దడానికి కృషి చేశారు.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై ప్రత్యేక సమావేశం పారిశుద్ధ్య డ్రైవ్ అనంతరం, తర్లుపాడు మండల పరిషత్ ఎంపీడీవో అభివృద్ధి కార్యాలయం ( ఎంపీడీవోఆఫీస్) నందు పంచాయతీ కార్యదర్శులు మరియు హరిత రాయబారులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు యస్ డి జీ యస్ సాధించడం, గ్రీన్ గార్డుల సామర్థ్యం పెంపు, మరియు గ్రామాలను పరిశుభ్రత, పచ్చదనం కలిగిన ఆదర్శ గ్రామాలుగా రూపొందించడంపై చర్చించారు.అధికారులు మాట్లాడుతూ, స్వచ్ఛభారత్ మిషన్ మరియు స్థానిక సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా, గ్రామాలను అభివృద్ధి చేయడంలో హరిత రాయబారులు కీలక పాత్ర పోషించాలని, ఇందుకోసం మరింత కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని పంచాయతీ కార్యదర్శులు కాళంగి శ్రీనివాసులు, టి సుభాకర్, బాలకృష్ణ, జె.పద్మ,పద్మావతి,గీత, పిన్నిక గోపి, డి హుస్సేన్,అనూష పాల్గొన్నారు.



