Listen to this article

జనం న్యూస్‌ 22 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

విజయనగరం జిల్లా పెదమానాపురం, బూర్జువలస మరియు ఎల్. కోట పోలీసు స్టేషనులు పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఆరుగురు నిందితులకు వారం రోజులు జైలుశిక్ష విధిస్తూ గజపతినగరం అదనపు జ్యుడిషి యల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎ.విజయ రాజకుమార్ మరియు కొత్తవలస మెజిస్ట్రేట్ విజయచంద్ర నవంబరు 21న శిక్ష విధించినట్లుగా జిల్లా ఎస్పీఎ. ఆర్. డామోదర్ తెలిపారు.వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా పెదమానాపురం పోలీసు స్టేషను పరిధిలోని గర్భాం జంక్షను వద్ద ఎస్ఐ ఆర్.జయంతి ఆధ్వర్యంలో పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా, మద్యం సేవించి, వాహనాలు నడిపిన (1) గజపతినగరం మండలం పాతబగ్గాం గ్రామానికి చెందిన కొలుసు అప్పన్న (2) పాచిపెంట మండలం మాతుమూరు గ్రామానికి చెందిన బుగ్గ చిన్న (3) బొబ్బిలి మండలం రాజులపేట గ్రామానికి చెందిన పెంట రఘు అనే ముగ్గురు అనే ముగ్గురు వ్యక్తులు పట్టుబడినారన్నారు.అదే విధంగా బూర్జువలస పోలీసు స్టేషను పరిధిలో ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది కృష్ణాపురం జంక్షను వద్ద తనిఖీలు చేపట్టి మద్యం సేవించి, వాహనాలు నడుపుతూ (4) ఒడిస్సా రాష్ట్రం రాయగడ జిల్లాకు చెందిన బలుసు కుశల్య (5) పార్వతీపురం మన్యం జిల్లా పుడేసు గ్రామానికి చెందిన కొండగొర్రి ధర్మారావు అనే ఇద్దరు నిందితులు పట్టుబడ్డారన్నారు.డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ఐదుగురిని గజపతినగరం అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎ. విజయ రాజకుమార్ వారి వద్ద హాజరుపర్చగా నిందితులు ఐదుగురికి వారం రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తెలిపారు.అదే విధంగా ఎల్.కోట పోలీసు స్టేషను పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపిన (6) రంగరాయపురం. గ్రామానికి చెందిన రామారావు అనే వ్యక్తి పట్టుబడగా, అతడిపై డ్రంకన్ డ్రైవ్ కేసు నమోదు చేసి కొత్తవలస మెజిస్ట్రేట్ విజయచంద్ర వారి వద్ద హాజరుపర్చగా, సదరు వ్యక్తికి రూ.10 వేలు జరిమాన, వారం రోజుల జైలుశిక్ష రెండింటిని విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.