Listen to this article

జుక్కల్ నవంబర్ 22 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలం రాంపూర్ కలాన్ గ్రామంలో జరిగిన వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో జుక్కల్ మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే పాల్గొన్నారు.
గ్రామ ప్రజలతో కలిసి పూజా కార్యక్రమాలలో పాల్గొన్న షిండే గారు, స్వామి దర్శనంతో ప్రాంతంలో శాంతి–సౌభాగ్యాలు నెలకొనాలని కోరుకున్నారు.ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరూ
ఆయురారోగ్యాలతో, ఆనందంతో, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని
మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు.గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆయన అందరికీ ధన్యవాదాలు తెలిపారు