జనం న్యూస్- నవంబర్ 22- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-
నాగార్జునసాగర్ ను శనివారం తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీస్ సెక్రటరీ మెంబర్ పంచాక్షరీ కుటుంబసమేతంగా సందర్శించారు. సాగర్ లోని విజయ విహార్ అతిథి గృహానికి చేరుకున్న వీరికి పెదవుర ఇన్చార్జి తాసిల్దార్ శ్రీదేవి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వీరు బుద్ధ వనాన్ని సందర్శించి బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. బుద్ధ వనంలోని బుద్ధ చరితవనం, జాతకవనం,ధ్యానవనం,స్తూప వనాలను సందర్శించిన అనంతరం మహా స్తూపం సమావేశ మందిరంలోని బుద్ధ వనం విశేషాలను తెలిపే వీడియోను వీక్షించారు. మహాస్తూపం అంతర్భాగంలోని ధ్యాన మందిరంలో బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన వీరిచే బుద్ధ జ్యోతిని వెలిగించి బుద్దవనం కండువాలతో, బ్రోచర్లతో సత్కరించారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర టూరిజం లాంచీలో నాగార్జున కొండను అక్కడ పురావస్తు మ్యూజియంని, పునర్ నిర్మిత కట్టడాలైన సింహాళ విహారం,మహాస్తూపం,అశ్వామేద యజ్ఞశాల మొదలగు వాటిని సందర్శించారు. అనంతరం నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్ ని సందర్శించారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ బుద్దవనం విశేషాలను, నాగార్జునకొండ చారిత్రక వివరాలను, నాగార్జునసాగర్ డ్యాం ప్రత్యేకతలను వివరించారు.వీరితో పాటు నాగార్జునసాగర్ టౌన్ ఎస్ ఐ ముత్తయ్య, ప్రోటోకాల్ ఆర్ ఐ దండ శ్రీనివాస్ రెడ్డి,కోర్టు సిబ్బంది ఖాలిక్ తదితరులు పాల్గొన్నారు.


