Listen to this article

టి యు డబ్ల్యు జే (ఐ జే యు)జిల్లా కమిటీ సహాయ కార్యదర్శిగా ధర్నాసి బాలరాజు

జనం న్యూస్ కల్లూరు/ఖమ్మం నవంబర్ 22

ఖమ్మంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) శనివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో కల్లూరు పట్టణంలో గల అంబేత్కర్ నగర్ కు చెందిన ఆంధ్రప్రభ సీనియర్ పాత్రికేయ మిత్రులు ధర్నాస్ బాలరాజు ను ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శిగా అదే విధంగా జర్నలిస్టుల పై దాడుల నివారణ కమిటీ జిల్లా సభ్యునిగా నియమించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కె రామనారాయణ, జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి మైసా పాపారావులు పూల మొక్కలతో బాలరాజు ను అభినందించారు విషయం తెలుసుకున్న పలు రాజకీయ పార్టీల నాయకులు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.