

జనంన్యూస్. ఫిబ్రవరి. 01.
నిజామాబాదు. ప్రతినిధి.
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తాటిపల్లి గ్రామంలో. అంకం సత్తయ్య.అనే రైతు తన మరదలు యొక్క ఆరోగ్యం బాగాలేదని తేదీ 31.1.2025 నాడు10 గంటలకు ఇల్లుకు తాళం వేసి వెళ్లగా తిరిగి ఈరోజు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు వచ్చి చూసేసరికి తన ఇంటి యొక్క తాళం పగలగొట్టి ఉండడంతో అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది అందులోని బంగారం సుమారుగా 14.5 తులాలు కనిపించలేదు కావున రాత్రి సమయంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాన్ని పగలగొట్టి ఇంట్లోకి వచ్చి బంగారాన్ని ఎత్తుకొని వెళ్ళినారని అంకం సత్తయ్య ఫిర్యాదు ఇవ్వగా ఏఎస్ఐ బాల్ సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైనది