Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

సబ్ టైటిల్ శివయ్య సేవ లభించడం ఎంతో అదృష్టం.

శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ పోతు గుంట రమేష్ నాయుడు ను నందలూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్య నారాయణ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఆదివారం రాజంపేట మండలం వైబియన్ పల్లెలోని చైర్మన్ పోతు గుంట రమేష్ నాయుడు స్వగృహంలో ఆయనను కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సూర్యనారాయణ మాట్లాడు తూ అనేక సంవత్స రాలుగా పోతు గుంట రమేష్ నాయుడు సమాజ సామాజిక సేవలతో పాటు భారతీయ జనతా పార్టీలో విశిష్ట సేవలు అందించడం తద్వారా ఆ శివయ్య సేవకుడిగా శ్రీశైలం బోర్డు చైర్మన్ పదవి దక్కడం ఆయన చేసుకున్న అదృష్టం అన్నారు. శ్రీశైలం దేవ స్థానానికి సరైన వ్యక్తికి చైర్మన్ పదవి లభించిందని తద్వారా ఆలయం అన్ని విధాల అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. చైర్మన్ పదవి లభించగానే పోతుకుంట రమేష్ నాయుడు టిటిడి నుండి 25 కోట్ల రూపాయలు శ్రీశైలం అభివృద్ధికి తీసుకు రావడం శుభ పరిణామం అన్నారు.కూటమి ప్రభుత్వంలో అందరి సహకారంతో ఆ దేవదేవుడి దయవల్ల పోదుగుంట రమేష్ నాయుడు మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని మనసారా ఆ భగవంతుని వేడుకుంటున్నామని అన్నారు.ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ శ్రీశైలం లాంటి మహోన్నత క్షేత్రం యొక్క క్షేత్రపాలకుడిగా నాకు అవకాశం లభించడం పూర్వజన్మ సుకృతం అని అన్నారు. శివయ్య దయతో అన్ని విధాల ఆలయ అభివృద్ధికి కృషి మంచి పేరు తీసుకువస్తానన్నారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టు అలీ రాజంపేట మార్కెటింగ్ కమిటీ మాజీ డైరెక్టర్ బెస్త సుబ్ర మన్యం తెలుగుదేశం నాయకులు తుమ్మాది శివకుమార్ పోమ్మల శివ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.