Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 24

భగవాన్ పుట్టపర్తి సాయిబాబా 100వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని, ప్రకాశం జిల్లా, తర్లుపాడులోని తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం (నవంబర్ 23, 2025) ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.
తహసీల్దార్ శ్రీ కె.కె. కిషోర్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, సాయిబాబా చిత్రపటానికి పూల మాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సాయిబాబా బోధనలు, మానవ సేవకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. సాయిబాబా చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.ప్రేమా, శాంతి సందేశాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.ఈ కార్యక్రమం ద్వారా రెవెన్యూ సిబ్బందిలో ఆధ్యాత్మికత, సేవా భావం మరింత పెరగాలని తహసీల్దార్ ఆకాంక్షించారుఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది ఆర్.ఐ. శ్రీ చరణ్
సీనియర్ అసిస్టెంట్ లక్ష్మి రెడ్డి టైపిస్ట్ నారాయణ రెడ్డి వి.ఆర్.ఓ.లు,వి.ఆర్.ఏ.లు పాల్గొన్నారు