Listen to this article

రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్24

జహీరాబాద్ నియోజకవర్గం మోగుడంపల్లి మండలంలోని సున్నం బట్టి తాండాకు గౌరవప్రదమైన అవకాశం లభించింది. సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ గారు మండల రైతు సంఘం జనరల్ సెక్రెటరీ పదవికి పోము రాథోడ్ గారిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ నియామకంతో మండలంలోని రైతుల సమస్యలను సమర్థంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ముందడుగు పడుతుందని నేతలు తెలిపారు. రైతుల సంక్షేమం, పంటల రక్షణ, ప్రభుత్వ పథకాల అమలు వంటి ముఖ్య అంశాలపై పోము రాథోడ్ కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.సున్నం బట్టి తాండా గ్రామంలో రైతులు కె ఫోన్ సూర్య నాయక్ ప్రేమ్ కుమార్ కె హరి సింగ్ ముక్రం దన్ సింగ్ కే శ్యామ్ రావు ఈ సమావేశంలో సున్నం బట్టి తాండ వాసులు తదితరులు పాల్గొన్నారుమరియు స్థానిక ప్రజలు ఈ నియామకాన్ని హర్షాభినందనలు తెలియజేశారు.